మంచిర్యాల: సొమ్ము కోసం ఘోరం.. భర్తను హత్య చేయించిన భార్య

3చూసినవారు
మంచిర్యాల: సొమ్ము కోసం ఘోరం.. భర్తను హత్య చేయించిన భార్య
మంచిర్యాల జిల్లాలో భార్య తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని, భర్త పేరున ఉన్న రూ.2 కోట్ల బీమా సొమ్మును కాజేయడానికి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కలకలం రేపింది. హాజీపూర్ మండలం గుడిపేటకు చెందిన సాయిని కుమార్(45) ఈ నెల 22న బైక్పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడి, కరీంనగర్ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించినట్లు మొదట భావించారు. అయితే, కుమార్ తల్లి లక్ష్మి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఈ మృతి వెనుక భార్య హస్తం ఉందని వెలుగులోకి తెచ్చారు.
Job Suitcase

Jobs near you