మంచిర్యాల: పశువులపై అడవి జంతువుల దాడి?

2చూసినవారు
మంచిర్యాల: పశువులపై అడవి జంతువుల దాడి?
మంచిర్యాలలో గత కొద్దిరోజులుగా అటవీ జంతువులు పశువులపై దాడి చేసి చంపుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈనెల 13న మధురానగర్ సమీపంలో వెంకటేష్ ఇంటి ఆవరణలో మూడు గొర్రెలను, పాత మంచిర్యాలలో శ్రీనివాస్ ఇంటి ప్రహరీ లోపల కట్టేసి ఉంచిన రెండు మేకలను అటవీ జంతువులు దాడి చేసి చంపాయి. మేకల మందలో ఉన్న పది మేకలపై కూడా ఈ దాడులు జరిగాయి. నక్కలు లేదా తోడేళ్లు ఈ దాడులకు పాల్పడుతున్నాయని ప్రజలు అనుమానిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you