దండేపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామానికి చెందిన రవి అనే యువకుడు ఆస్తి తగాదాల నేపథ్యంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తహిసీనోద్దీన్ తెలిపారు. ఫిబ్రవరి 27న మనస్తాపానికి గురై పురుగుమందు తాగిన రవిని కుటుంబ సభ్యులు లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. తల్లి కొమురక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.