లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జనరల్, టెక్నికల్ కోర్సులలో ప్రవేశాల కోసం ఆసక్తి గల
విద్యార్థులు జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు సూచించారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్సీసీ, కొత్తగా ఏసీఈ కోర్సులతో పాటు మూడు టెక్నికల్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు.