తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడా మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసానికి విచ్చేసినప్పుడు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆయనకు శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్ వంటి ప్రముఖులు పాల్గొన్నారు.