బీసీ సంఘాల బలోపేతానికి జాతీయ నాయకత్వం పిలుపు

699చూసినవారు
బీసీ సంఘాల బలోపేతానికి జాతీయ నాయకత్వం పిలుపు
మంచిర్యాల జిల్లా కేంద్రానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్ విచ్చేయగా, వారికి ఘన స్వాగతం లభించింది. బీసీల సంక్షేమం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం జాతీయ నాయకత్వం అందిస్తున్న పిలుపునకు అనుగుణంగా జిల్లాలో బీసీ సంఘాలను మరింత బలోపేతం చేస్తామని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నీలకంటేశ్వర రావు శాలువాలతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్