
పసికందును ముళ్ల పొదల్లో పడేసిన తల్లి!
TG: చాలా మంది ఆడపిల్లలు పుడితే పండుగలా ఇంటికి ఆహ్వానిస్తున్నారు. కానీ, కొన్ని చోట్ల ఆడపిల్ల పుట్టిందని పొదల్లో విసిరేసిన ఘటనలు వెలుగు చూడటం బాధాకరం. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ఇలాంటి హృదయవిదారక ఘటనే చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడపిల్లను ఓ తల్లి ముళ్ల పొదల్లో పడేసింది. ఆ ముక్కుపచ్చలారని పసికందును కుక్కలు పీక్కుతిన్నాయి. తల్లి పొత్తిళ్లలో సేద తీరాల్సిన చిన్నారి.. చనిపోయి కనిపించిన దృశ్యం కంటతడి పెట్టిస్తోంది.




