వృద్ధురాలు మృతి

2చూసినవారు
వృద్ధురాలు మృతి
దండేపల్లి మండలకేంద్రానికి చెందిన సాయిని లక్ష్మి(80) మతిస్తిమితం సరిగా లేక ఇంటి నుంచి వెళ్లిపోయి మృతి చెందినట్లు ఎస్సై తహిసీనోద్దీన్ తెలిపారు. శుక్రవారం గ్రామ సమీపంలోని ఎర్రకుంట చెరువు వైపు ఓ వ్యక్తి వెళ్లగా పొదల్లో వృద్ధురాలి మృతదేహం కనిపించింది. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉంది. బాధితురాలి కుమారుడు గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్