లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి

0చూసినవారు
లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి
ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ విషాదఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మహమ్మదాబాద్ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతుడు సింగరాయపేట గ్రామానికి చెందిన ఆడాయి మారుతి( 25)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బైకు వెనక కూర్చున్న గంగాధర తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా జన్నారం ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

సంబంధిత పోస్ట్