మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ లో సోమవారం సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అక్టోబర్ 7 న హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో జరుగనున్న కమిటీ ఆవిర్భావ దినోత్సవ అవగాహన సదస్సు పోస్టర్ ను అడిషనల్ కలెక్టర్ పడాల రాములు ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా నిధుల వినియోగం, పరిపాలనకు సంబందించిన సమాచారాన్ని చట్టబద్ధంగా తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ కార్యదర్శి తోట శ్రీనివాస్ నిర్వహించారు.