రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన విద్యార

6చూసినవారు
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా చాటిన విద్యార
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన తొమ్మిదవ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో మంచిర్యాల జిల్లా విద్యార్థులు పలు విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించారు. క్యాడెట్ బాయ్స్ అండర్ 61 kg ఫైటింగ్ విభాగంలో మోక్షిత్ బంగారు పతకం, అండర్ 41 kg ఫైటింగ్ విభాగంలో శ్రీవాస్తవ కాంస్య పతకం, జెస్విత్ కాంస్య పతకం, అలాగే అండర్ 36 కేజీ ఫైటింగ్ విభాగంలో దేవర్శిస్ లు బహుమతులు గెలుచుకున్నట్లు మంచిర్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్