పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతి నది అంత్య పుష్కరాల ముగింపు వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా ముగిశాయి. పుష్కరాల ముగింపు రోజైన సోమవారం నాడు చెన్నూరు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు కపుష్కర ఘాట్ వద్ద పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం వారు నదీమతల్లికి ప్రత్యేక పూజలు మరియు హారతులు సమర్పించారు. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. వేద పండితులు వారికి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం పలికారు. ఈ కార్యక్రమం మంచిర్యాల జిల్లాలో జరిగింది.