మంచిర్యాల పట్టణంలో ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ జనాభాలో 60% ఉన్న బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం 14% కూడా లేదని, ఇప్పటివరకు 130 రాజ్యాంగ సవరణలు చేసిన ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లపై ఒక్కసారి సవరణ చేసి చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం బీసీల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి, జనాభా ఆధారంగా అవకాశాలు కల్పించాలని, లేనిచో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.