
ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తోన్న వర్షం (వీడియో)
AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. నెల్లూరు, మార్కాపురం, తిరుపతి వంటి పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కోస్తా, రాయలసీమలోని ఇతర జిల్లాల్లోనూ మేఘావృతమై, వర్షం పడే అవకాశాలున్నాయి. కాగా, కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.




