రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.