మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని 29 గ్రామ పంచాయతీలలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేశారు. ఎంపీడీఓ ఆఫీస్ అధికారులు మంగళవారం ఈ సామాగ్రిని ఆయా గ్రామాల్లోని పోలింగ్ బూతులకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికలు సమగ్రంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మండల అధికారులు తెలిపారు.