మంచిర్యాల జిల్లా జన్నారం మండల ప్రజలు హైవే రహదారిపై ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. గతంలో ఇలాంటి చెట్లు రోడ్లపై పడి ప్రాణనష్టం జరిగిన సంఘటనలున్నాయి. వెంటనే చర్యలు తీసుకొని రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రమాదకర చెట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.