మంచిర్యాల జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐటీడిఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరంను బుధవారం గిరిజన ఆదివాసీ పర్ధన్ పురోహిత్ సేవా సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం, మొక్క అందజేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో ఆదివాసుల అభివృద్ధి, జీవనశైలిపై చర్చించారు. రాష్ట్ర అధ్యక్షులు మెస్రం మనోహర్ మాట్లాడుతూ, ఆదివాసీ తొమ్మిది తెగల్లో పర్ధన్ తెగ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, ప్రాజెక్ట్ అధికారి పరిపాలనలోనైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెస్రం శేష్ నారాయణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆడాయి పాల్గొన్నారు.