
లారీ కింద పడి వ్యక్తి మృతి.. సీసీ ఫుటేజ్
TG: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ కావడంతో కానూరు రాజు(30) అనే వ్యక్తి లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ హృదయ విదారక దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మృతుడు శాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.




