లక్ష్మణచందా మండలంలో బుధవారం నర్సాపూర్(డబ్ల్యు) గ్రామానికి చెందిన కాయితి రవీందర్ రెడ్డి (48) అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. అటవీ పందుల నుంచి పంటను రక్షించుకోవడానికి పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెను ప్రమాదవశాత్తూ తాకడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలోనే రైతు మృతి చెందాడు.