కుంటలో పడి బాలుడు మృతి – పెంచికల్పేట్ విషాదం

503చూసినవారు
పెంచికల్పేట్ మండలం చెడ్వాయి గ్రామంలో బుధవారం ఉదయం నీటి కుంటలో పడి డోబి చింటూ అనే బాలుడు మృతి చెందాడు. కాగజ్‌నగర్ మండలం ఆరెగూడకు చెందిన చింటూ సెలవుల కోసం అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. మంగళవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. బుధవారం ఉదయం గ్రామ సమీప కుంటలో శవంగా కనిపించడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్