May 15, 2026, 16:05 IST/బెల్లంపల్లి
బెల్లంపల్లి
పొట్యాల గ్రామస్తులకు ఎమ్మెల్యే వినోద్‌తో తాగునీటి కష్టాలు తీరాయి
May 15, 2026, 16:05 IST
మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లిలో వేసవిలో తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న పొట్యాల గ్రామస్తులకు ఉపశమనం లభించింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ చొరవతో చిన్నవేంకటాపూర్ పంచాయతీ పరిధిలోని పొట్యాల గ్రామంలో కొత్త బోర్ వెల్ ఏర్పాటు చేశారు. ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే చూపుతున్న వేగాన్ని స్థానికులు ప్రశంసిస్తున్నారు. గ్రామ సర్పంచ్ జలంపెల్లి భాస్కర్, జిల్లా డీసీసీ వైస్ ప్రెసిడెంట్ బొమ్మేన హరీష్ గౌడ్ ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.