హీరో మంచు మనోజ్ తన భార్య భూమా మౌనిక రెడ్డితో కలిసి ఆటోలో ప్రయాణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణ ప్రయాణికుల్లా ఆటోలో వెళ్తున్న దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ సందర్భంగా స్పందించిన మనోజ్.. తమ కారు బ్రేక్‌డౌన్ కావడంతోనే ఆటోలో ప్రయాణించాల్సి వచ్చిందని తెలిపారు. సెలబ్రిటీ అయినప్పటికీ సాదాసీదాగా వ్యవహరించడంతో నెటిజన్‌ల నుంచి ప్రశంసలు పొందుతున్నారు.