మోహన్‌బాబు యూనివర్సిటీపై జరిమానా.. స్పందించిన మంచు విష్ణు

86చూసినవారు
మోహన్‌బాబు యూనివర్సిటీపై జరిమానా.. స్పందించిన మంచు విష్ణు
AP: విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయ వివరాలు వెల్లడించకపోవడం వంటి అంశాలపై ఉన్నత విద్య నియంత్రణ కమిషన్‌ మోహన్‌బాబు యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో మీడియాలో వస్తున్న వార్తలపై యూనివర్సిటీ ప్రో-ఛాన్సలర్‌ మంచు విష్ణు స్పందిస్తూ, కమిషన్‌ చేసినవి కేవలం సిఫార్సులేనని, ఈ వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉందని తెలిపారు. విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను దిగజార్చే నిరాధార వార్తలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్