తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ గోపురంపై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి హల్‌చల్ సృష్టించాడు. ఏకాంత సేవ అనంతరం ఆలయ గేట్లు మూసిన తర్వాత లోపలికి ప్రవేశించిన ఆ వ్యక్తి, గోపురంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ, 90ml మద్యం ఇస్తేనే కిందకి దిగుతానని డిమాండ్ చేశాడు. ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి, తాళ్లతో బంధించి అతన్ని కిందికి దించారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఆలయ గోపురంపై ఉన్న రెండు కలశాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి.