డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా?

4325చూసినవారు
డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండు తినొచ్చా?
వేసవిలో మామిడి పండ్లు చాలా మందికి ఇష్టమైనవి. అయితే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయా అనే సందేహం ఉంది. నిపుణుల ప్రకారం, మామిడి పండు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) 51-60 మధ్య ఉంటుంది, ఇది రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెంచదు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ దీపక్ కుమార్ సుమన్ ప్రకారం, రోజుకు ఒక చిన్న మామిడి పండు లేదా 100 గ్రాములకు మించి తినకూడదు. ఉదయం ఖాళీ కడుపుతో తినడం, షేక్‌లు తాగడం మంచిది కాదు. పీచు ఎక్కువగా ఉండే పండ్లు, నట్స్‌తో కలిపి తినడం మేలు. మధుమేహ రోగులు మితంగా, సరైన పద్ధతిలో తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్