
నాదెండ్ల భాస్కరరావు లేని లోటు పూడ్చలేనిది: ప్రధాని మోదీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ప్రజలకు భాస్కరరావు అనేక సేవలందించారని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని మోదీ అన్నారు. భాస్కరరావు మృతి తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీరని లోటు అని పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.




