మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం వద్ద మంజీరా నదీపాయ పొంగిపొర్లుతోంది. ఆనకట్ట నుంచి 85,396 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వస్తుండగా, గర్భగుడి వరకు ప్రవాహం చేరింది. మొదటి బ్రిడ్జి వద్ద బారికేడ్లు వేసిన అధికారులు, భక్తులు నాగ్సాన్‌పల్లి మార్గం ద్వారా రావాలని సూచించారు.