ప్రధానమంత్రి నరేంద్ర
మోదీ తన 'మన్ కీ బాత్' 133వ ఎపిసోడ్ ద్వారా ఆదివారం (ఏప్రిల్ 26) దేశ ప్రజలతో ముచ్చటించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అవగాహన కల్పించారు. ఇటీవల పార్లమెంటులో మహిళా బిల్లుకు ఎదురైన అడ్డంకులు, మహిళా సాధికారతపై దీని ప్రభావం గురించి ప్రధాని చర్చించారు. తల్లుల త్యాగాలను స్మరిస్తూ ఆయన ఒక ప్రత్యేక సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమం ఆల్
ఇండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రత్యక్ష ప్రసారం అయింది.