
అసలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది.. ?
AP: కర్నూలు బస్సు ప్రమాదం తెల్లవారుజామున 3.30 గంటలకు జరిగింది. ఆ టైంలో భారీగా వర్షం పడుతోంది. ఆ సమయంలో ఓ బైకర్ బస్సుకు అడ్డంగా రావడంతో బస్సు ఢీకొట్టింది. వెంటనే బైక్ బస్సు కిందకు వెళ్లి డీజిల్ ట్యాంక్ భాగానికి తగలడంతో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి.. క్రమంగా మొత్తం బస్సుకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపు బస్సు పూర్తిగా దగ్ధమైందని కర్నూలు ఎస్పీ తెలిపారు.




