TG: మావోయిస్టు అగ్రనేత ఆనంద్ (70) అనారోగ్యంతో డిసెంబర్ 8న భద్రాదికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని చింతిరేలలో కన్నుమూశారు. ఈ విషయంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆనంద్ అసలు పేరు తోట సీతారామయ్య. విద్యార్థి దశలోనే రాడికల్ ఉద్యమంలో చేరి, 1980లో పూర్తికాల కార్యకర్తగా పీపుల్స్ వార్‌లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర కమిటీ డాక్యుమెంటేషన్ పనుల్లో గణపతికి అత్యంత సన్నిహితుడిగా పనిచేశారు. 2023లో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు రావడంతో అరెస్టు అయ్యి, తరువాత బెయిల్‌పై ఇంటికి చేరారు.