ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. హిడ్మాపై దాదాపు కోటి వరకు రివార్డు ఉంది. హిడ్మాతో పాటు మరో నలుగురు కూడా మృతి చెందారు. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.