
కోటీశ్వరున్ని చేసిన 30 ఏళ్ల క్రితం పేపర్లు
సుమారు 30 ఏళ్ల క్రితం 1995లో ఒక వ్యక్తి జేవీఎస్ఎల్ కంపెనీకి చెందిన 100 షేర్లను ఒక్కొక్కటి రూ. 10 చొప్పున, మొత్తం రూ. 1000 పెట్టి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ షేర్ల పేపర్లను ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. 2005లో జేవీఎస్ఎల్ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ సంస్థలో విలీనమైంది. అప్పుడు ఒక జేవీఎస్ఎల్ షేర్‌కు బదులుగా 16 జేఎస్‌డబ్ల్యూ షేర్లు వచ్చాయి. దీంతో ఆ వ్యక్తి 100 షేర్లు 1600 షేర్లు అయ్యాయి. ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ షేరు ధర రూ. 1,146 ఉండటంతో, ఆ షేర్ల విలువ రూ. 1.83 కోట్లకు చేరింది.




