మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసినట్లు వైరల్ అవుతోంది. సోను పేరుతో 6 పేజీల లేఖ ఎలాంటి గుర్తు లేకుండా విడుదల చేసినట్లు ఉంది. 'తాత్కాలికంగా ఆయుధాలను వదిలేస్తున్నాం. శత్రువుల దాడిలో ఎంతో మంది కామ్రేడ్లను కోల్పోయాం. అమరవీరులందరికీ పేరుపేరునా జోహార్లు. ఈ పోరాటాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాం. ఈ ఓటమి చాలా బాధాకరమైనది' అని అందులో పేర్కొన్నారు.