నేడు బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. పోలీసుల అప్రమత్తం

5చూసినవారు
నేడు బంద్‌కు మావోయిస్టుల పిలుపు.. పోలీసుల అప్రమత్తం
మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా పలువురు మావోల ఎన్కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టు పార్టీ ఆదివారం దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో ఛత్తీస్గఢ్ పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. బస్తర్ డివిజన్‌లోని 7 జిల్లాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. నేషనల్ పార్క్, పామేడు, అబూజ్‌మడ్ అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ పోలీసులు భద్రతను పెంచారు. దాడులు జరగవచ్చనే అనుమానంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్