తెలంగాణ వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) రాష్ట్ర కమిటీ ఈ నెల 9న బంద్‌కు పిలుపునిచ్చింది. గత నెల 30న ఏడుగురు మావోయిస్టులను పోలీసులే విషమిచ్చి చంపారని ఆరోపించింది. పోలీసులకు అప్రూవర్ గా మారిన వ్యక్తితో భోజనాలు ఏర్పాటు చేయించి, స్పృహ కోల్పోయేలా చేశారని లేఖలో తెలిపింది. ఆ తర్వాత వారిని చిత్ర హింసలు పెట్టి హతమార్చినట్లు పేర్కొంది.