స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించకుండా మావోలు అడ్డుకున్నారు: మోదీ

6చూసినవారు
స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించకుండా మావోలు అడ్డుకున్నారు: మోదీ
గత 24 గంటల్లో 300కు పైగా మావోయిస్టులు లొంగిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ NDTV సమ్మిట్లో తెలిపారు. గత 50-55 ఏళ్లుగా మావోయిస్టులు వేలాది మందిని చంపారని, స్కూళ్లు, ఆస్పత్రుల నిర్మాణాన్ని అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. మావోయిస్టు తీవ్రవాదం యువతకు అన్యాయం చేసిందని, దారితప్పిన యువతను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి కృషి చేశామని, దశాబ్దం క్రితం 125 నక్సల్స్ ప్రభావిత జిల్లాలు ఇప్పుడు 11కు తగ్గాయని మోదీ వివరించారు.

ట్యాగ్స్ :