నారాయణపూర్‌లో లొంగిపోయిన మావోయిస్టులు (వీడియో)
By BS Naidu 21504చూసినవారుఛత్తీస్గఢ్లోని నారాయణపూర్‌లో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 12 మంది మావోయిస్టులు బుధవారం లొంగిపోగా.. వీరిలో 9 మందిపై రూ.18 లక్షల చొప్పున రివార్డ్ ఉంది. లొంగిపోయిన మావోయిస్టులకు పోలీసులు రూ.50 వేలు చెక్కు అందజేశారు. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా దళాలు ముమ్మర గాలింపు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మావోలు పోలీసుల ముందు లొంగిపోతున్నారు.