TG: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.4.5 కోట్ల విలువైన గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి లగేజీ బ్యాగ్‌లో గంజాయిని దాచి తరలించే ప్రయత్నం చేయగా స్క్రీనింగ్ సమయంలో అధికారులకు పట్టుబడింది. DRI అధికారులు NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.