మరికొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య

14చూసినవారు
మరికొన్ని గంటల్లో పెళ్లి.. ప్రియుడితో కలిసి యువతి ఆత్మహత్య
పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ఓ యువతి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని మోరెనాలో 19 ఏళ్ల యువతి, బంధువైన 22 ఏళ్ల యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. అంతేకాకుండా యువతికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. దీంతో ప్రేమ జంట ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. వారిద్దరూ ఒకే స్కార్ఫ్ ఉపయోగించి ఉరేసుకున్నారని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్