
2025లో టాలీవుడ్ హీరోలకు కమ్‌బ్యాక్ ఇచ్చిన సినిమాలు ఇవే!
ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోలకు కొత్త ఊపిరి పోసింది. 'ఓజీ'తో పవన్ కళ్యాణ్, 'సంక్రాంతికి వస్తున్నాం'తో సీనియర్ స్టార్ హీరో రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కొత్త ఊపిరి పోశారు. నాగార్జున 'కుబేర'లో, సుమంత్ 'అనగనగ'తో మెప్పించారు. నాగచైతన్య 'తండేల్'తో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, మంచు మనోజ్ 'మిరాయ్'లో విలన్‌గా ఆకట్టుకున్నారు. రామ్ పోతినేని 'ఆంధ్ర కింగ్ తాలూకా'తో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'కిష్కింధపురి'తో ఫామ్‌లోకి వచ్చారు. ఆది సాయికుమార్ 'శంబాల'తో, రోషన్ మేక 'ఛాంపియన్'తో భారీ విజయాలు అందుకున్నారు.




