దేశంలో మైనార్టీ తీరకుండానే పెళ్లి.. NFHS సర్వే నివేదిక

55చూసినవారు
దేశంలో మైనార్టీ తీరకుండానే పెళ్లి.. NFHS సర్వే నివేదిక
కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన జాతీయ కుటుంబ, ఆరోగ్య సర్వే (NFHS)-6 నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 15.9 శాతం మంది అబ్బాయిలు 21 ఏళ్లు నిండకుండానే వివాహం చేసుకుంటున్నారు. 2023-24లో జరిగిన ఈ సర్వేలో, ప్రతి వంద మంది అబ్బాయిల్లో 16 మంది మైనర్లుగానే పెళ్లి చేసుకుంటున్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 19 శాతంగా ఉండగా, పట్టణ, నగరాల్లో 9.7 శాతంగా నమోదైంది. చట్టబద్ధమైన వయసు రాకముందే యువకులు వివాహాలు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Job Suitcase

Jobs near you