TG: హైదరాబాద్ నాగోల్ పరిధిలో ఉంటున్న బానోత్ అనిల్ నాయక్(24)తో మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన మహిళ(38)కు పరిచయం ఏర్పడింది. యువకుడితో గడిపేందుకు ఆ మహిళ నాగోల్‌లోని అతని ఇంటికి వచ్చింది. తన కుమారుడు(3)కి చికిత్స చేయిస్తానని చెప్పి రెండు రోజులు అక్కడే ఉంది. ఈ క్రమంలో మహిళ వాష్‌రూమ్‌లో చీరతో ఉరేసుకుంది. దీంతో అనిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.