చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య

66010చూసినవారు
చీమలకు భయపడి వివాహిత ఆత్మహత్య
TG: సంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. చీమలకు భయపడి వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అమీన్‌పూర్ పీఎస్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నవ్య హోమ్స్ లో నివసిస్తున్న మనీషా (25) మైర్మెకోఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్