చీరతో ఉరి వేసుకుని వివాహిత మృతి

67చూసినవారు
చీరతో ఉరి వేసుకుని వివాహిత మృతి
AP: "నా చావుకు ఎవరూ బాధ్యులు కారు" అని లేఖ రాసి గాయత్రి అనే వివాహిత చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కుప్పంలో చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 2 నెలల క్రితం భర్త యువరాజ్ కూడా ఇదే చీరతో ఆత్మహత్యాయత్నం చేశాడని, అప్పుడు కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని బంధువులు తెలిపారు. మృతదేహం సమీపంలో లభించిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్