అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

6చూసినవారు
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
AP: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు సమీపంలో శుక్రవారం జరిగింది. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో కాలిన గాయాలతో మహిళను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలు కొండపల్లికి చెందిన సాతుపాటి జ్యోతిగా గుర్తించారు. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందా? హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్