
ప్రేమ పెళ్లి.. నెల రోజులకే యువతి ఆత్మహత్య
AP: ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సూరంపాలెంలో కట్నం వేధింపుల కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో డిగ్రీ చదువుతున్న చంద్రలేఖ, రమణక్కపేటకు చెందిన ఆరెళ్ల లితిన్ను గత నెల 23న వివాహం చేసుకుంది. పెళ్లైన కొద్ది రోజులకే కట్నం తీసుకురాలేదంటూ అత్తింటివారు వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. మంగళవారం రెండు కుటుంబాలతో మాట్లాడతామని పోలీసులు చెప్పగా.. ఇంటికి వచ్చాక తాను తప్పు చేశానంటూ తల్లిదండ్రుల వద్ద విలపించింది. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.




