కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ భారీగా ధరలను తగ్గించింది. గరిష్ఠంగా రూ.1,29,600 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ తగ్గనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఎంట్రీ మోడళ్లు ఎస్ ప్రెస్సోపై రూ.1,29,600 వరకు, ఆల్టో కే10పై రూ.1,07,600 వరకు, సెలెరియోపై రూ.94,100 వరకు, వ్యాగనార్‌పై రూ.79,600 వరకు తగ్గనున్నాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ 22 నుంచి వర్తిస్తాయి.