మారుతి సుజుకి స్విఫ్ట్ CNGలో తొలిసారిగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్విఫ్ట్ CNG-AMT పేరుతో విడుదలైన ఈ కొత్త వేరియంట్ ప్రారంభ ధర రూ.7.92 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇందులో 1.2 లీటర్ జెడ్-సిరీస్ పెట్రోల్ ఇంజిన్, ఏజీఎస్ (AMT) గేర్‌బాక్స్ ఉంటాయి. CNG మోడ్‌లో 69Bhp శక్తి, 101.8Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ప్రకటించిన మైలేజీ 32.85 కి.మీ./కిలోగా ఉంది. 2024 నాలుగో తరం స్విఫ్ట్ ఆధారంగా రూపొందించారు. డిజైన్ పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.