మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 'మాస్ జాతర' సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని క్లీన్ U/A సర్టిఫికెట్‌ను పొందినట్లు చిత్ర బృందం తెలిపింది. కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం రవితేజకు మంచి కమ్‌బ్యాక్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.